
మేడ్చల్ తరపున విరాళంగా ఇస్తామన్న మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించేందుకు మేడ్చల్ నియోజకవర్గం తరపున మరో 4 కేజీల బంగారం విరాళంగా ఇవ్వనున్నట్టు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. మేడ్చల్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్ అసోసియేషన్, ఇంజినీరింగ్ కళాశాలల యజమానులు విరాళమిచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. దీపావళి తర్వాత యాదాద్రి ఆలయ అధికారులకు విరాళాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
దాతలు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేసి విరాళాలుజమచేయవచ్చు
