ఘట్కేసర్, డిసెంబర్ 9: బస్తీ దవాఖానలతో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలాజీనగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్తీ ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారన్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ దవాఖానల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
కార్యక్రమంలో డీఎంహెచ్వో మల్లికార్జునరావు, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు ఎం.జంగయ్య యాదవ్, వైద్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానలో షుగర్, బీపీ పరీక్షలు చేయించుకున్నారు. అలాగే, టీఆర్ఎస్ నాయకుడు, ఘట్కేసర్ రైతు సొసైటీ మాజీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గౌడ్ తండ్రి మరణంతో ఆయన ఇంటికి వెళ్లి మంత్రి పరామర్శించారు.