హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సిలార్ మిట్టల్ కంపెనీ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో మంత్రి కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మిట్టల్‌ను కలిసి, రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. స్టీల్ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను మిట్టల్ ద్వారా తెలుసుకొన్నట్టు మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మిట్టల్‌తో కరచాలనం చేసిన ఫొటోను షేర్ చేశారు.