KTR | రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్ల చెత్త పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలపై లెక్కలతో పక్కాగా వివరిస్తాననిస్పష్టం చేశారు. డేట్ అండ్ టైం ప్లేస్ ఏదైనా సరే.. ‘వరంగల్ ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్ తరఫున తాను చర్చకు వస్తా.. రాహుల్‌గాంధీ వస్తారో? ఇంకెవరొస్తారో తేల్చుకోండి. మీ పాలనావైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా’నని చాలెంజ్ చేశారు.
కాగా, కేటీఆర్ సవాల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) స్పందించారు. తాను తెలంగాణ భవన్‌కు నేడు(గురువారం) 11 గంటలకు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు. మంత్రి చాలెంజ్‌ను స్వీకరిచిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో మీ కోసం ప్రత్యేకంగా కుర్చీ రెడీగా ఉంది. మీదే ఆలస్యం దమ్ముంటే చర్చకు రావాలన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అటు తెలంగాణ భవన్, ఇటు గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. జూపల్లి వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, ఆర్బీఐ లెక్కలు, సాక్ష్యాలతో సహా వివరిస్తామని వారు తెలిపారు. కాగా, జూపల్లితో చర్చకు కేటీఆర్ అవసరం లేదని తాను సరిపోతానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కావాలంటే కేటీఆర్ కూడా వస్తారన్నారు. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని నెరవేర్చారో చర్చకు బరాబర్ సిద్ధమేనన్నారు. కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని లెక్కలతో తిప్పికొడుతామన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు.