Mahesh Babu | రాజమౌళి కోసం మహేష్ సాహసం.. జర్మనీ బ్లాక్ ఫారెస్ట్‌లో షర్ట్‌లెస్‌గా హై-వోల్టేజ్ యాక్షన్?
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జర్మనీలోని ప్రసిద్ధ బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ సినిమా కోసం అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట. దట్టమైన అడవులు, క్లిష్టమైన భూభాగం మధ్య సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను రాజమౌళి అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ యాక్షన్ ఘట్టాల్లో మహేష్ బాబు షర్ట్‌లెస్ లుక్‌లో కనిపించనున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కెరీర్లో ఇప్పటివరకు కనిపించని ఫిజిక్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఆయన ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ఎపిసోడ్ సినిమా హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన మహేష్ బాబు, రాజమౌళి గారితో సినిమా చేస్తే ఆయన నన్ను షర్ట్ లేకుండా కూడా నటింపజేస్తారేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే తరహా ప్రచారం జరగడంతో ఆ వ్యాఖ్య మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వర్కౌట్స్, ట్రెక్కింగ్‌తో తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టుగా కొత్త లుక్‌లో కనిపించేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ ఫారెస్ట్ నేపథ్యంలో చిత్రీకరించే ఈ ఎపిసోడ్లు కథలో కీలక మలుపుగా నిలవనున్నాయని ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, మహేష్ బాబు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

