నల్లగొండ : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో
పలు అభివృద్ధి పనులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.7 కోట్ల పైచిలుకు పనులకు శంకుస్థాపన చేశారు.
మొదట గట్టుకింద అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన వసతి షెడ్డును ప్రారంభించి, రాజగోపురం వద్ద రూ.3.10 కోట్లతో నిర్మించిన 30 గదులను ప్రారంభించారు.
అనంతరం గుట్టపైన రూ.2.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కల్యాణ మండపం విస్తరణ పనులకు, రూ.1.28 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చివరగా రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గోశాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తదితరులు ఉన్నారు.