జనగామ : వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలోని పలు గ్రామాల్లో పూజాసా కార్యక్రమాల్లో పాల్గొని ఆన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్, పాలకుర్తి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహ కమిటీ, కొండపురం పెద్ద తండా పరిధిలో గల సీతి తండాలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు.
అలాగే రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని, కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవరుప్పుల మండలంలోని చిన్నమడూర్ గ్రామంలో దళిత యువజన సంఘం, నవయుగ యూత్ అసోసియేషన్, దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదాన కార్యక్రమాలని ప్రారంభించారు. అంతకుముందు పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో ముత్యాలమ్మ గుడికి భూమి పూజ చేశారు.