చండీఘడ్: భారతీయ రక్షణ దళంలో ఇన్నాళ్లూ కీలక ఆయుధంగా వెలిగిన మిగ్-21 యుద్ధ విమానం(MiG21Retirement) ఇవాళ్టి నుంచి కనుమరుగుకానున్నది. మిగ్21 విమానం రిటైర్మెంట్ సందర్భంగా ఇవాళ గ్రాండ్‌గా ఫేర్వెల్ ఆర్గనైజ్ చేశారు. 1963లో చండీఘడ్ ఎయిర్‌బేస్‌లో తొలిసారి ఎగిరిన ఆ యుద్ధ విమానం ఇవాళ అక్కడే తన ఫేర్వేల్ ప్రదర్శన ఇవ్వనున్నది. మిగ్21 రిటైర్మెంట్ సందర్భంగా ఇవాళ ఆ యుద్ధ విమానాలతో ఫ్లైపాస్ట్ నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో డాగ్‌ఫైట్స్ నిర్వహించనున్నారు. మిగ్21లతో స్కై డైవింగ్ కూడా చేయనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఫేర్వెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
We shall remember you, #MiG21! A legendary icon of the Indian Air Force, this fearless warrior has etched its valour across generations. As its final sortie marks the close of a historic era, the #IAF celebrates its legacy with pride and ushers in a bold new chapter of innovation… pic.twitter.com/kp4WUy3aeo
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) September 26, 2025
ఐఏఎఫ్‌కు చెందిన నెంబర్ 23 స్క్వాడ్రన్‌లో ఆరు మిగ్21 విమానాలు ఉన్నాయి. ప్యాంథర్స్ గ్రూపుకు చెందిన ఆ యూనిట్‌ను రాజస్తాన్‌లోని బికనీర్ నుంచి చండీఘడ్‌కు తరలించారు. సోవియేట్‌కు చెందిన మిగ్21 విమానాలను 1961లో ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది థార్డ్ జనరేషన్ జెట్ ఫైటర్. బ్రిటీష్ ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ లైటనింగ్, యూఎస్ ఎఫ్-104 స్టార్ఫైటర్కు బదులుగా భారతీయ రక్షణ దళం మిగ్21 విమానాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తర్వాత నాలుగు దశాబ్ధాల పాటు యుద్ధ విమానాల దళంలో ఐఏఎఫ్‌కు వెన్నుముకగా మిగ్21 నిలిచింది.
1965 నాటి ఇండోపాక్ వార్‌లో మిగ్21 కీలక పాత్ర పోషించింది. లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ కాంపేన్ సమయంలో వైమానిక క్షేత్రంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఢాకాలోని గవర్నర్ హౌజ్‌పై అటాక్ జరిగిన సమయంలో మిగ్21 విమానాన్ని వినియోగించారు. దీంతో తూర్పులోని పాకిస్థాన్ ఆర్మీ కుప్పకూలింది. ఢాకాలోని తేజ్గావ్ ఎయిర్‌ఫీల్డ్‌ను మిగ్ 21 ధ్వంసం చేసింది.
1985లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో.. సియాచిన్ గ్లేసియర్ వద్ద మిగ్21 కీలక ఆపరేషన్ చేపట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత్ కశ్మీర్లో జరుగుతున్న రన్‌వే నిర్మాణ పనుల గురించి సీక్రెట్ కెమెరా ద్వారా మిగ్21 ఫోటోలు తీసింది. స్కర్దూ ఎయిర్‌బేస్‌లో పాకిస్థాన్ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై మిగ్ ఫోకస్ పెట్టింది. 1999, మే 26వ తేదీన మిగ్21 యుద్ధ విమానాలు తొలిసారి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాయి. నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ యుద్ధ సమయంలో మిగ్21 విమానాలు ఉదయం 6.30 నిమిషాలకే శత్రు స్థావరాలపై అటాక్ చేశాయి.
1999 ఆగస్టు 10వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత.. గుజరాత్ తీరం రన్ ఆఫ్ కచ్ సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన నేవీ పెట్రోలింగ్ విమానాన్ని మిగ్ కూల్చివేసింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న స్క్వాడ్రన్ లీడర్ ఆర్కే బుందేలా కు వీర చక్ర ఇచ్చారు. మూడు కిలోమీటర్ల రేంజ్ నుంచి అతను ఆర్60 మిస్సైల్‌ను ఫైర్ చేశాడు. పాక్‌కు చెందిన 16 మంది సిబ్బంది, అయిదుగురు ఆఫీసర్లు, 11మంది ట్రైనీలు మృతిచెందారు.
2019లో బాలాకోట్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసిన సమయంలో మిగ్21 వాడారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఈ మిగ్‌తో ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చారు. అయితే అభినందన్ విహరించిన మిగ్21 కూడా కూలడంతో అతను పాక్ ఆక్రమిత కశ్మీర్లో పడ్డాడు. వింగ్ కమాండర్‌ను పట్టుకున్న పాక్ సేనలు ఆ తర్వాత అతన్ని భారత్‌కు అప్పగించాయి.