న్యూఢిల్లీ : కొన్నేండ్ల కిందట వరకూ ఏఐ చాట్‌బాట్స్‌తో (Meta AI chatbots) మనుషుల ముచ్చట్ల గురించి ఆలోచన కేవలం సైన్స్ ఫిక్షన్ బుక్స్, సినిమాలకే పరిమితం. మనుషుల తరహాలోనే మన ప్రశ్నలకు స్పందించి, మనకు ఎన్నో విషయాల్లో సాయం చేసే చాట్‌బాట్స్‌తో మనం త్వరలో మాట్లాడతామనే ఆలోచన ఊహకు కూడా అందేది కాదు. గత ఏడాది నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన తర్వాత ఈ ఊహలన్నీ కార్యాచరణ దిశగా కదులుతున్నాయి.
ఏఐ చాట్‌బాట్ మ్యూజిక్ కంపోజ్ చేయడం దగ్గరనుంచీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడం, వ్యాసాలు రాయడం, బుక్స్ రాయడం వరకూ ఎన్నో ప్రాబ్లమ్స్‌ను ఇట్టే చక్కదిద్దుతున్నాయి. ఏఐ టెక్నాలజీపై ఓపెన్ఏఐనే కాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఎన్నో కంపెనీలు తమవైన ఏఐ చాట్‌బాట్స్‌ను రంగంలోకి దించాయి. ఇక మెటా అప్‌కమింగ్ చాట్‌బాట్స్ ఈ వారంలో టెక్ ప్రపంచంలో సందడి చేయనున్నాయి.
యువ యూజర్లను ప్రధానంగా టార్గెట్ చేస్తూ మెటా ఏఐ చాట్‌బాట్స్ సేవలు అందిస్తాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బాబ్ ది రోబోట్ ప్రత్యేకతల గురించి మెటా టెకీలు మాట్లాడుకున్నారని ఈ రిపోర్ట్ వెల్లడించింది. అల్విన్ ది ఏలియన్ పేరుతో మరో చాట్‌బాట్‌ను మెటా ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఈ ఏఐ చాట్‌బాట్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ-4 వెర్షన్ కంటే అత్యంత శక్తివంతమైన ఏఐ సిస్టమ్స్‌పై మెటా కసరత్తు సాగిస్తోందని కూడా అంతకుముందు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
Read More :
Jawan Movie | రూ.1000 కోట్ల క్లబ్లో జవాన్.. వరుసగా రెండోసారి రికార్డు సాధించిన షారుఖ్..