Meiyazhagan Movie | కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravindha Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). ఈ సినిమాకు ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడకకు ముఖ్య అతిథిగా సూర్య వచ్చి సందడి చేశాడు.
అయితే ఈ సినిమా గురించి నటుడు కార్తీ మాట్లాడుతూ.. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తమిళం డైలాగ్‌ను ఇమిటేట్ చేశాడు. దిల్ రాజు వారసుడు సినిమా ఫంక్షన్లో ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు.. సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్కు.. అనే డైలాగ్ ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డైలాన్‌ను కార్తీ చెప్పాడు.
మెయ్యళగన్ సినిమాలో ”ఫైట్ వేణుమా ఫైట్ కీడయాదు” (ఫైట్ కావాలంటే ఫైట్ ఉండదు), సాంగ్ వేణుమా సాంగ్ కీడయాదు, లవ్ వేణుమా లవ్ కీడయాదు. కానీ ఈ సినిమా బాగుంటుంది. మీరు కచ్చితంగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు అంటూ కార్తీ తెలిపాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govindha Vasantha) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Fight venuma Fight kidaiyathu, Song venuma song Kidaiyathu ,Love venuma Love kidaiyathu 😂@Karthi_Offl on Full Swing 🔥⚡#Meiyazhagan | #Karthi pic.twitter.com/W3JJ4rNhOm
— Vanthiyathevan_Da🔥🌟 (@KavinKfc) September 1, 2024
also read..