Chiranjeevi | డీప్‌ఫేక్ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిది: మెగాస్టార్ చిరంజీవి
డీప్‌ఫేక్ (Deep Fake) అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దాని వల్ల ముప్పు కూడా ఉందని చెప్పారు.
హైదరాబాద్: డీప్‌ఫేక్ (Deep Fake) అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దాని వల్ల ముప్పు కూడా ఉందని చెప్పారు. ప్రభుత్వాలు కూడా దీని పై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, లేదంటే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరూ డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన పని లేదని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘ఏక్తా దివస్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లులో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యునిటీ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనర్ పాల్గొన్నారు. 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అంతుకుముందు చిరు మాట్లాడుతూ.. సర్దార్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత అందరికి ఆదర్శనీయమన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పారు. వన్ నేషన్‌ని పటేల్ మనకు అందించిన ఇచ్చిన వరమని వెల్లడించారు. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అంటూ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సందేశమన్నారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం లో పాల్గొనే అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయాలన్నారు.
డిప్ ఫేక్ పై స్పందిస్తూ.. తెలంగాణా పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పారు. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని, ఏ ఆపద వచ్చిన వారికి తోడుగా రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు. ఇటీవల కొందరు నా ఫోటోలను డీప్ ఫేక్ చేసి అశ్లీల వీడియోలు, ఫోటోలు సృష్టించారని వెల్లడించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని చెప్పారు. డీప్ ఫేక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని, ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని పేర్కొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారని వెల్లడించారు. డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని, కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని హెచ్చరించారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు.
#WATCH | Hyderabad, Telangana: On the occasion of ‘Rashtriya Ekta Diwas’, actor Chiranjeevi, along with DGP B. Shivadhar Reddy and Commissioner of Police V.C. Sajjanar, attends the Run for Unity event on the birth anniversary of Sardar Vallabhbhai Patel at Peoples Plaza, Necklace… pic.twitter.com/UzVZ29VQSf
— ANI (@ANI) October 31, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

