మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మిన్నంటుతున్నాయి. మార్చి 27న చరణ్ 36వ వసంతంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఫ్యాన్స్ వారం ముందు నుండే హంగామా చేస్తున్నారు. చరణ్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్డడం,తమ అభిమాన హీరోకు ప్రత్యేక బహుమతులు పంపడం వంటివి చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యాన్స్ కొందరు రామ్ చరణ్ ఇంటికి చేరుకొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
తనకు విష్ చేయడానికి వచ్చిన అభిమానులతో కలిసి రామ్ చరణ్ దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సాయంత్రం 4 గం.లకు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి సర్ప్రైజింగ్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Megapower Star #RamCharan with fans 2/2 pic.twitter.com/Lc7ftbKPif
— BA Raju's Team (@baraju_SuperHit) March 26, 2021