కాసిపేట : వర్షాకాలంలో అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే వ్యాధుల ( Seasonal diseases) పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ వో హరీష్ రాజ్ ( DMHO Harish Raj ) సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మామిడిగూడెంలో ఆయన పర్యటించారు. గ్రామంలో తిరిగి పరిసరాలను పరిశీలించారు. జ్వరాలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గత వారం డెంగ్యు కేసు నమోదు కోలుకున్నారని, మరొకరు డెంగ్యూ అనుమానం చికిత్స అందించగా వారు సైతం కోలుకున్నారని స్థానిక సిబ్బంది వివరించారు. గ్రామంలో వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ వో గ్రామస్థులకు సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ వో సుధాకర్ నాయక్ , డీఈఎంవో వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, హెచ్ఈవో చంద్రశేఖర్, హెచ్ఏ నారాయణ ఉన్నారు.