హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)గా మార్చాలని కొద్దిరోజులుగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ), టీవీవీపీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది.
టీవీవీపీని డైరెక్టరేట్‌గా మార్చే ఫైల్‌పై తాజాగా ముఖ్యమంత్రి సంతకం చేసినట్టు టీజీజీడీఏ ప్రతినిధులు వెల్లడించారు. డైరెక్టరేట్‌గా మార్చే ఫైల్‌పై సీఎం సంతకం చేయడం పట్ల టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలుప్రసాద్ రాథోడ్, కోశాధికారి రవూఫ్ హర్షం వ్యక్తం చేశారు.