వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్ డాక్యుమెంటరీ ‘సైలెంట్ స్క్రీమ్స్’. ప్రతిభావంతులైన నటీనటులు నటించిన ఈ డాక్యుమెంటరీకి అరవింద్ దర్శకుడు. ప్రణవ్ నిర్మాత. సన్ నెక్ట్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతున్నది.
స్త్రీలపై జరిగిన దారుణ నేరాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ ఇదని మేకర్స్ చెబుతున్నారు. శృతి హాసన్ వాయిస్ ఓవర్ ఈ డాక్యుమెంటరీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, స్త్రీలపై జరిగిన అఘాయిత్యాలు, అటు సమాజంపై ఇటు కుటుంబాలపై వాటి ప్రభావం.. మనసుల్ని తాకేలా ఈ డాక్యుమెంటరీలో చూపించామని మేకర్స్ తెలిపారు.