ఉగ్రవాదం కారణంగా మనోవేదనకు గురైన భారతీయ ముస్లీంగా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాలో నటించారు షారుఖ్ ఖాన్. ఆ సినిమాలోని నటనకు విమర్శకుల ప్రశంసలందుకున్నారాయన. ఇప్పుడు మళ్లీ షారుఖ్ మనసు ఉగ్రవాదం కథలపై మళ్లిందని బాలీవుడ్ న్యూస్. అయితే.. ఈ సారి ఉగ్రవాదానికి యుద్ధ నేపథ్యాన్ని కూడా ముడిపెట్టనున్నారట ఈ బాలీవుడ్ బాద్షా. ‘కల్ హో నహో’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నిఖిల్ అద్వానీ ఇటీవలే షారుఖ్‌కు ఓ కథ వినిపించారట.
తీవ్రవాదం, వార్ నేపథ్యంతో సాగే ఈ కథ షారుఖ్‌కి బాగా నచ్చిందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనున్నట్టు వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇదిలావుంటే.. షారుఖ్ ఈ సినిమాకు ఓకే చేయడానికి కారణం యురి, ధురంధర్ సినిమాల విజయాలేననీ, ఈ తరహా కథలను ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తున్న నేపథ్యంలో షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నారనీ బాలీవుడ్ మీడియా అభిప్రాయపడుతున్నది.