తాండూర్ : సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రభలకుండా గ్రామాలలో ముందస్తుగా మెడికల్ క్యాంపులు (Medical Camps) నిర్వహించాలని డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సుధాకర్ నాయక్ ( Sudhakar Nayak) ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిగురువారం సందర్శిం చారు. ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసు కున్నారు.
ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సమర్థవంతమైన పర్యవేక్షణ, నియమిత వైద్య సేవలు, ప్రభల జ్వరాల నివారణకు నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన పెంచేందుకు క్యాంపులు నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం రోగులకు సంబంధించిన రిజిస్టర్స్, ల్యాబ్, వార్డులు, మెడిసిన్ స్టాక్, శానిటేషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఝాన్సీరాణి , సీహెచ్ వోలు జయమేరి, మోటేశ్వర్లు, సూపర్ వైజర్లు రమాదేవి, తార, ల్యాబ్ టెక్మిషన్ హకీమ్, సిబ్బంది దౌలత్, నర్సింగ్ ఆఫీసర్ జయలక్ష్మి ఉన్నారు .
మాదారంలో వైద్య శిబిరం..
మండలంలోని మాదారం టౌన్ షిప్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 32 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. 22 మందికి బీపీ, 19 మందికి మలేరియా, 10 మందికి షుగర్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ ఎం పద్మ, గ్రామ కార్యదర్శి సౌందర్య, ఆశ కార్యకర్త మల్లేశ్వరి, ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.