మెదక్ మున్సిపాలిటీ, ఆగస్ట్టు 28 : పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి పట్టణ ప్రజలకు మట్టి, విత్తన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపులో భాగంగా మట్టి, విత్తన విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. ప్రజలు మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజించాలని కోరారు. ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ తయారీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. కాలుష్య నివారణలో భాగంగా ప్రతిఒక్కరూ మట్టి గణపతులను పూజించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినట్ల అవుతుందన్నారు.
ప్రజలందరికీ ఆయురారోగ్యాలతోపాటు ఐశ్వర్యాల ను ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ద్వారక గార్డెన్లో పట్టణ ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, కిశోర్, సమీయొద్దీన్, ఏడుపాయల ఆలయ కమిటీ డైరెక్టర్ రాగి చక్రపాణి, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ అంజాగౌడ్, వైస్ చైర్మన్ పురం వెంకటనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, అశోక్, గట్టేశ్, నగేశ్, కొండ శ్రీనివాస్, ముకుందం, బండ నరేందర్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
నర్సాపూర్, ఆగస్టు 28 : మున్సిపల్ కార్యాలయంలో నేటి నుంచి మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు ము న్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని కోరారు.