మనోహరాబాద్, అక్టోబర్ 3: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మిలది కీలకపాత్ర అని కాళ్లకల్ మాజీ ఉప సర్పంచ్ కాళిదాసన్ అన్నారు. మండలంలోని కాళ్లకల్ పారిశుధ్య కార్మికులకు సోమవారం దుస్తులను అందజేశారు. దసరా సందర్భంగా వారి కృషిని అభినంది స్తూ కొత్త దుస్తులను బహుకరించారు.
శివ్వంపేట, అక్టోబర్ 3 : మండలంలోని గూడురు గ్రా మంలో పంచాయతీ కార్మికులతో పాటు పలువురు పేద ప్ర జలకు సోమవారం ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్ శివకుమార్‌గౌడ్, సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బట్టలు పంపిణీ చేశారు. దసరా పండగ ను అందరూ సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు సూర్యంగౌడ్ పాల్గొన్నారు.
రామాయంపేట, అక్టోబర్ 3 : దసరా, బతుకమ్మ పండు గ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి రామా యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ సోమవారం దుస్తులను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నుంచి తనవంతు సహాయంగా పారిశుధ్య కార్మికులకు, 70 సిబ్బందికి మందికి పైగా ప్రత్యేకంగా దస రా, బతుకమ్మకు దుస్తులను సొంత డబ్బులతో అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు యాదగిరి, నాగరాజు, సుందర్‌సింగ్, ప్రసాద్, పోచమ్మ, శంకర్, నరేశ్, శ్రీనివాస్, సూర్య, ప్రవీణ్ పాల్గొన్నారు.