High Court : కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj)కు జైలు శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందున ఆయనకు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. మంగళవారం విచారణ అనంతరం కలెక్టర్‌కు జైలు శిక్ష విధిస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీలు సుకోవడానికి కలెక్టర్‌కు 4 వారాల గడువు ఇచ్చింది.
బోనాల్ గ్రామవాసి లక్ష్మీ వేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. భూ వివాదంలో కోర్టు ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని ఆమె పిటిషన్ వేసింది. లక్ష్మి పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. కలెక్టర్ రాహుల్ రాజ్ తీరును తప్పుపట్టింది. కోర్టు ఆదేశాను ధిక్కరించినందుకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా వేసింది. అప్పీల్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తీర్పు అమలను నాలుగు వారాలు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది.