
మెదక్ అర్బన్, అక్టోబర్ 27 : గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశాలపైన మెదక్ ఎస్సీ చందనదీప్తి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ అదనపు ఎస్పీ కృష్ణమూర్తి మాట్లాడుతూ గంజాయి ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించాలన్నారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలను సమూలంగా నిర్మూలించాలన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ప్రతి గ్రామ పోలీస్ అధికారి, వార్డు పోలీస్ అధికారి వారికి కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో నిఘా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. లాడ్జీలు, బస్టాం డ్లు , కళాశాలలు, లేబర్ అడ్డాలు, తదితర ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం లీగల్ అడ్వజర్ రాములు మాట్లాడుతూ మత్తు పదార్థాల విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలను సిబ్బందికి వివరించారు. సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.