
ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పటిష్టానికి కృషిచేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యేలా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, పటాన్చెరు, నర్సాపూర్, మానకొండూరు నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈనెల 25న ప్లీనరీ, నవంబర్ 15న జరిగే విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
మెదక్, అక్టోబర్ 21 : ఈనెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబర్ 15న జరిగే విజయగర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మెదక్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మా ట్లాడుతూ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పార్టీ ద్వారానే ప్రభుత్వ పదవులు వచ్చాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల్లో సీఎం కేసీఆర్ పైన సానుకూల దృక్పథం ఉందని, దానిని మరింత పెంచేలా మనందరం కృషి చేయాలన్నారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు రావడానికి ఉత్సాహంగా ఉన్నారని, వారిని సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్‌గౌడ్, మెదక్ పట్టణ, మండల, హవేళీఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట పట్టణ, రామాయంపేట మండలం, నిజాంపేట మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు గం గాధర్, అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజు, నాగరాజు, మహేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీలు లావణ్యరెడ్డి, సుజాత, షర్మిల, మా ధవి, సంధ్య, విజయ్‌కుమార్, ఎంపీపీలు య మున, శేరి నారాయణరెడ్డి, చందన, భిక్షపతి, సిద్ధిరాములు, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్లు కిష్టయ్య, శ్రీహరి, నర్సారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సంపత్, మెదక్, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌ను కలిసిన టీఆర్ఎస్ నాయకులు
రామాయంపేట, అక్టోబర్ 21 : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను రామాయంపేట ఉమ్మడి మండల నాయకులు కలిశారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామాయంపేట, నిజాంపేట ఎంపీపీలు భిక్షపతి, సిద్దిరాములు, రామాయంపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నిజాంపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీలు విజయ్‌కుమార్, సంధ్య, రైతుబంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, కౌన్సిలర్ నాగరాజు ఉన్నారు.