
తూప్రాన్/రామాయంపేట/మనోహరాబాద్/నిజాంపేట/చేగుంట/కొల్చారం : సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాకు మెదక్ జిల్లా తూప్రాన్, రామాయంపేట, మనోహరాబాద్, నిజాం పేట, చేగుంట, నార్సింగి మండలాల నుంచి వందలా దిగా టీఆర్ఎస్ కార్య కర్తలు తరలివెళ్లారు. మనోహరాబాద్ నుంచి జడ్పీ చైర్పర్సన్ హేమలత , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్, ఎంపీపీ నవనీత, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి వెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి , పట్టణాధ్యక్షుడు సతీశ్‌చారి, మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, శ్రీశైలంగౌడ్, దామోదర్‌రెడ్డి, సత్యనారాయణ, నాచారం ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ చంద్రారెడ్డి, మన్నె శ్రీనివాస్, కొడిప్యాక వెంకటేశం వెళ్లారు. రామా యంపేట మండల కేంద్రం నుంచి మున్సిపల్ చైర్మన్ పల్లె జతేందర్గౌడ్, మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్‌లు శివప్రసాద్‌రావు, శ్యాము లు, సుభాశ్, స్వామి, ఇమ్మానియేల్ తదితరులున్నారు. ని జాంపేట నుంచి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధ్దిరాములు, చైర్మన్ మహేశ్, అందె కొండల్‌రెడ్డి తదితరులున్నారు. చేగుంట, నార్సింగి మండలాల నుంచి నా ర్సింగి మండల అధ్యక్షుడు మైలారం బాబు, సత్యనారాయణ, ఎన్నం లింగారెడ్డి, తౌర్యానాయక్ తదితరులున్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత తెలపాలని ఇందిరాపార్కులో నిర్వహించిన మహాధర్నాకు నర్సాపూర్ నియోజవర్గ పరిధిలోని నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, మాసాయిపేట్, శివ్వంపేట్ మండలాల నుంచి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. కొల్చారం మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు భా రీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదేశాలతో మం డల ప్రజాప్రతినిధులు, నాయకులకు ధర్నాకు తరలి వచ్చారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, ఎం పీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాలతో పాటు సర్పంచ్ లు, ఎంపీటీలు, రైతులు తరలివెళ్లారు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ నగరంలో చేపట్టిన మహా ధర్నాకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరప్ప ఆధ్వర్యంలో టేక్మాల్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అవినాష్, పీఏసీఎస్ ఛైర్మన్ యశ్వంత్‌రెడ్డి, డైరక్టర్ సత్యం, శ్రీశైలం, చందర్, ఎంపీటీసీ మోహన్, మహేందర్, సర్ధార్ తదితరులు ఉన్నారు.