
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్11: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేడు తలపెట్టిన ధర్నా ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో రైతులతో కలిసి నిర్వహించే ధర్నాకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని విజ్ఞప్తి చేశారు.
మెదక్‌లో ధర్నాకు తరలి రావాలి
చిన్నశంకరంపేట,నవంబర్11:కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవంలంభిస్తున్న వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ శుక్రవారం మెదక్‌లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రైతు బంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు గురువారం పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా హాజరై ధర్నాను విజయవంతం చేయాలన్నారు.
దుబ్బాకకు తరలాలి…
చేగుంట,నవంబర్ 11: తెలంగాణ రైతుల పట్ల కేంద్రప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంతో పాటు, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యతిరేక ప్రచారాలను మానుకోవాలని చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. చేగుంటలో విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం దుబ్బాకలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి చేగుంట,నార్సింగి మండలలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామకమిటీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున్న పాల్గొని నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రవీణ్‌కుమా ర్ తెలిపారు. కార్యక్రమంలో నార్సింగి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలా రం బాబు, మాజీ సొసైటీ చైర్మన్ తౌర్యనాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సి ద్ధ్దు, నాయకుడు బాలశివ తదితరులున్నారు.
నర్సాపూర్‌లో ధర్నాకు తరలిరావాలి
వెల్దుర్తి, నవంబర్ 11. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోవడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు, రైతులు హాజరై విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఎంపీపీ స్వరూపా నరేందర్‌డ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్‌లో నిర్వహించే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని కోరారు.