
రామాయంపేట, నవంబర్11: రైతులు పండించిన ధాన్యా న్ని బీజేపీ కచ్చితంగా కొనుగోలు చేయాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రా మాయంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నేడు తలపెట్టిన ధర్నాకు రామాయంపేట నుంచి భారీ ఎత్తున మెదక్‌కు తరలి వెళ్తామన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నాయకత్వంలో విజయవంతం చేస్తామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శారద రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ హైమద్, మల్యాల కిషన్, చంద్రపు కొండల్‌రెడ్డి, శ్యాంసుందర్, బాలుగౌడ్, మెట్టు యాదగిరి, చింతల రాములు, స్వామిగౌడ్ ఉన్నారు.
నేటి ధర్నాను విజయవంతం చేయాలి
నిజాంపేట, నవంబర్ 11:కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్న కారణంగా నేడు మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండలం నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, అనుబంధ కమిటీలు,కార్యకర్తలు,టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తూప్రాన్ నుంచి…
తూప్రాన్, నవంబర్ 11: నేటి ధర్నాను సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు తూప్రాన్ కౌన్సిలర్ శ్రీశైలంగౌడ్, నాయకులు చంద్రారెడ్డి, మన్నె శ్రీనివాస్, వెంకటేశం, బురానొద్దీన్, దామోదర్‌రెడ్డి, ఆంజనేయులు అన్నారు. తూప్రాన్ పట్టణంలోని విలేకరులతో మాట్లాడారు.నేడు నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు బైక్ ర్యాలీతో తరలి వెళ్లాలన్నారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీతో నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ కు తరలివెళ్లాలన్నారు.
నర్సాపూర్ జరిగే ధర్నాకు తరలిరావాలి
కొల్చారం, నవంబర్ 11: వడ్ల కొనుగోళ్లపై రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ఎండగట్టేందుకు నర్సాపూర్‌లో శుక్రవారం జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావాలని కొల్చారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాం పల్లి గౌరీశంకర్, మండల టీఆర్ఎస్ నాయకులు, మండల గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఎం పీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు , సర్పంచ్‌లు టీఆర్ఎస్ శ్రేణులను, రైతులను తీసుకొని రావాలని కోరారు. ఉదయం 11 గంటల వరకు నర్సాపూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకోవాలని, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు.
నేడు నర్సాపూర్‌లో టీఆర్ఎస్ ధర్నా
నర్సాపూర్,నవంబర్11: నేడు నర్సాపూర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనడానికి కేంద్రం నిరాకరిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ధర్నా చేపడుతున్నామని వెల్లడించారు. ధర్నా కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొంటారని, టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.