పాపన్నపేట : వనదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ( Padma Devender Reddy ) ఆకాంక్షించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాత ( Bhavani Mata ) అమ్మవారిని గురువారం ఆమె దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పద్మ దేవేందర్‌రెడ్డికి ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆమె వెంట మెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, నాయకులు న్యాయవాది జీవన్ రావు ,మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్,ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.