మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Massive fire | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంపై అంతస్తులో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ నాలుగు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత నలుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే, నలుగురు భారీ పొగకారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో శాస్త్రిభవన్‌లో ప్యూన్‌గా చేస్తున్న 59 వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, ప్యూన్‌తో పాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Fire broke out
- Seemapuri
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

