Mass Jathara | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, అందాల ముద్దుగుమ్మ శ్రీలీల కథానాయికగా తెరకెక్కుతున్న హై ఆక్టేన్ మాస్ ఎంటర్టైనర్ “మాస్ జాతర” సినిమా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్స్ యూత్‌లో బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ఓ మాస్ నంబర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హుడియో హుడియో,, అని సాగే ఈ పాటను దేవ్ రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భీమ్స్, హేశం అబ్దుల్ వాహద్ పాడారు.
రవితేజ – శ్రీలీలపై చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. దసరా – దీపావళి సెలవులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.రవితేజ – శ్రీలీల కాంబినేషన్, భీమ్స్ మ్యూజిక్, మాస్ టైటిల్ – ఇవన్నీ కలిసొచ్చి “మాస్ జాతర” పై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమా పట్ల హోప్స్ పెరిగాయి.
మొత్తం మీద, మాస్ మహారాజ అభిమానులకు ఈ అక్టోబర్ నెల నిజంగా ఒక పెద్ద పండుగలా మారనుంది. “హుడియో హుడియో” పాట ప్రోమోతో రవితేజ మాస్ ఎంటర్టైన్మెంట్కి ఇంకొంచెం వేడి పెరిగేలా ఉంది! అయితే ఈ మూవీ బాహుబలి చిత్రానికి పోటీగా విడుదల కానుండడంతో అభిమానులు కాస్త టెన్షన్ పెడుతున్నారు. మూవీ అటూ ఇటుగా ఉంటే మాత్రం రవితేజ సినిమాకి పెద్ద దెబ్బ పడుతుందని విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు.