హైదరాబాద్, డిసెంబర్ 20: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి చెందిన మినీ ట్రక్కు సూపర్ క్యారీ మరో మైలురాయికి చేరుకున్నది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్ష వాహనాలు అమ్ముడై రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐదేండ్లలో ఈ మైలురాయికి చేరుకోవడం విశేషం. ఈ మినీ ట్రక్కు పెట్రోల్, సీఎన్జీల్లో మాత్రమే లభిస్తున్నది. 2016లో ఈ వాహనం విడుదల చేయడంతో మారుతి సుజుకీ కమర్షియల్ విభాగంలోకి అడుగుపెట్టినట్లయింది. సీఎన్జీ వెర్షన్ 21.55 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.