Maruti | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : మారుతి మరో మాడల్ ధరను పెంచేసింది. మల్టీ పర్పస్ వాహనమైన ఎర్టిగా ధరను రూ.15 వేలు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ మాడల్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికంకానున్నది. ఈ కారు ధర రూ.8.84 లక్షల నుంచి రూ.12.43 లక్షల వరకు లభించనున్నది.