LSG vs RCB : ఐపీఎల్ 19లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓపెనర్ మిచెల్ మార్ష్(116 నాటౌట్) విధ్వంసక శతకంతో రెచ్చిపోయాడు. వరుణుడి అంతరాయం నడమ సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లకు దడ పుట్టించిన మార్ష్.. సెంచరీతో భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అతడి జోరును పూరన్(38), కెప్టెన్ రిషభ్ పంత్(32 నాటౌట్)లు కొనసాగించగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో లక్నో 209 పరుగుల స్కోర్ కొట్టింది.
సొంతగడ్డపై లక్నోఓ ఓపెనర్ మిచెల మార్ష్(116 నాటౌట్) వీరకొట్టుడుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కుదేలయ్యారు. తొలి ఓవర్ నుంచే భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌లను ఎడాపెడా ఉతికేసిన మార్ష్ 20 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అతడి విధ్వంసంతో పవర్ ప్లేలో అజేయంగా 68 పరుగులు చేసిన లక్నో ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 9వ ఓవర్ పూర్తి కాగానే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి లక్నో వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసింది.
Raise that bat 🙌
And take a bow, Mitchell Marsh 🙇
📸 📸 A 2️⃣nd #TATAIPL ton to savour ✨
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/jsWQnrkglQ
— IndianPremierLeague (@IPL) May 7, 2026
వాన కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించడంతో ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం ఉంచాలనే కసితో మార్ష్ మరింత చెలరేగాడు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(17) విఫలమైనా.. ఐపీఎల్లో రెండో శతకంతో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడీ హిట్టర్. స్ట్రాటజిక్ బ్రేక్ అనంతరం హేజిల్‌వుడ్ ఓవర్లో మార్ష్ ఔటైనా.. కెప్టెన్ రిషభ్ పంత్(32 నాటౌట్) వస్తూనే రెండు ఫోర్లు, సిక్సర్‌తో 18 రన్స్ పిండుకున్నాడు. డేంజరస్ నికోలస్ పూరన్(38)ను రసిక్ దార్ సలాం వెనక్కి పంపడంతో లక్నో నిర్ణీత ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 209 రన్స్ కొట్టింది.