Suryakumar Yadav | తండ్రైన భారత కెప్టెన్.. మా ఇంట్లోకి చిన్నారి ఏంజెల్ వచ్చిందంటూ పోస్ట్..!
Suryakumar Yadav : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మొదటిసారి తండ్రయ్యాడు. అతడి భార్య దేవిశ శెట్టి(Devisha Shetty) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Suryakumar Yadav : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మొదటిసారి తండ్రయ్యాడు. అతడి భార్య దేవిశ శెట్టి(Devisha Shetty) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల బేబీబంప్తో కనిపించిన .. గురువారం బిడ్డను కన్నది. ఈ విషయాన్ని మా ఇంట్లోకి చిన్నారి ఏంజెల్ వచ్చింది అనే పోస్ట్తో సూర్య అభిమానులకు తెలియజేశాడు.
టీమిండియా స్టార్, టీ20ల్లో సంచలన బ్యాటరైన సూర్యకుమార్ యాదవ్ తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. 2016లో దేవికను పెళ్లాడిన సూర్య.. తొలిసారి ఫాదర్ క్లబ్లో చేరాడు. తమ ఇంట్లోకి ఓ దేవత వచ్చిందని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
With giggles, bows, and dreams to unfurl- we welcome our baby girl 🩷🧿 pic.twitter.com/NlvE2tJdJw
— Surya Kumar Yadav (@surya_14kumar) May 7, 2026
‘ముసిముసి నవ్వులు, కలలు నిజమైన వేల.. మేము చిన్నారి పాపకు తల్లిదండ్రులమయ్యాం’ అని తమ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోతో సూర్య పోస్ట్ పెట్టాడు. అతడి పోస్ట్ చూసినవాళ్లంతా మిస్టర్ 360 జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలైందని అభినందనలు చెబుతున్నారు. అయితే.. పెళ్లైన పదేళ్లకు సూర్య, దేవిశ జంట ముగ్గురవ్వడంతో వారి కుటుంబసభ్యుల సంతోషానికి, ముంబై ఇండియన్స్ అభిమానుల సంతోషానికి అవధులు లేవు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

