LSG vs RCB | మార్ష్ దూకుడుకు బ్రేకులేసిన వాన.. ఊపిరిపీల్చుకున్న ఆర్సీబీ బౌలర్లు..!
LSG vs RCB : లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(76 నాటౌట్) విధ్వంసానికి వరుణుడు అడ్డుపడ్డాడు. మార్ష్ దూకుడుతో సెంచరీ దిశగా పరుగెడుతున్న లక్నో స్కోర్ బోర్డుకు మోకాలడ్డుతూ మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు.
LSG vs RCB : ఏక్నా స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(76 నాటౌట్) విధ్వంసానికి వరుణుడు అడ్డుపడ్డాడు. మార్ష్ దూకుడుతో సెంచరీ దిశగా పరుగెడుతున్న లక్నో స్కోర్ బోర్డుకు మోకాలడ్డుతూ మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. 9వ ఓవర్ పూర్తి అయిందో లేదో వాన మొదలైంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. వాన పుణ్యమాని మార్ష్ ఊచకోత నుంచి బతికిపోయామని ఆర్సీబీ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.
సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో మిచెల మార్ష్(76 నాటౌట్) వీరకొట్టుడుకు వర్షం బ్రేకులు వేసింది. భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌లను సైతం బాదేస్తూ 20 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన మార్ష్ పవర్ ప్లే తర్వాత జోరు ఆపలేదు. మార్ష్‌ను ఎలా అడ్డుకోవాలి? అని తలలు పట్టుకున్న ఆర్సీబీకి వరుణుడు అండగా నిలిచాడు. 9వ ఓవర్ పూర్తి కాగానే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్ ఆగేసరికి లక్నో అజేయంగా 95 పరుగులు చేసింది. మార్ష్ జతగా ఇన్నింగ్స్ ఆరంభించి వికెట్ కాచుకున్న అర్షిన్ కులకర్ణి 17 రన్స్ కొట్టాడు.
Play stopped in Lucknow due to rain! 🌧️
Stay Tuned for further updates.#TATAIPL | #KhelBindaas | #LSGvRCB
— IndianPremierLeague (@IPL) May 7, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

