నల్లగొండ, జనవరి 10 : శాలిగౌరారం మండలం పెరక కొండారం గ్రామ వాసి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ లైఫ్ మెంబర్, సామాజిక సేవకుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి డాక్టరేట్ లభించింది. శ్రీ ఉషోదయ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ సంస్థ పేరు మీదుగా ఆయన గత 26 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం, ఆధ్యాత్మిక దేవాలయాలకు ఆర్థిక సహాయం, ఉచిత మెగా వైద్య శిబిరాలు, మెగా రక్తదాన శిబిరాలు, చలివేంద్రాల ఏర్పాటు, యువజన సంఘాల ద్వారా స్కూల్, కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సులు, అనాథ శవాలను మార్చురీస్కు తరలించడం, అవయవ దానం, మలేరియా, టీబీ, హెచ్ఐవీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం తదితర సామాజిక సేవలకు గుర్తింపుగా భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ (BVU) శ్రీనివాస్‌రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ ఏజే ఇంటర్నేషనల్ బెంగళూరు నందు యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ తంగవేణి చేతుల మీదగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ డాక్టర్ ఎస్ రాగసందేశ్ , ఐఐసీఏ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ రామస్వామి, సౌందర్య రాజన్, టీఎన్ స్వామి, రీజినల్ డైరెక్టర్ డాక్టర్ షణ్ముగన్, డాక్టర్ కృష్ణన్, యూత్ వాలంటీర్స్ మర్రెడ్డి ప్రవళిక, శివరామకృష్ణ, లిఖిత పాల్గొన్నారు.