అడ్డగుట్ట, ఫిబ్రవరి 24 : గంజాయి క్రయవిక్రయాలు జరుపుతున్న ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో గురువారం డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన రాజు రహత్(35), గిరిధరి కైబార్త(36), బుంగార్జ్ శబార్(26) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. వీరు పంకజ్ సరాజ్ నుంచి డ్రై గంజాయి సరుకును కిలోకు రెండు వందల చొప్పున కొనుగోలు చేస్తారు. దీనిని లాల్‌బజార్‌కు చెందిన కరోల్ మహేశ్ కుమార్(23), బోయిన్‌పల్లికి చెందిన మహ్మద్ అన్వర్(21)కు కిలోకి మూడు వందల చొప్పున విక్రయిస్తారు. మహేష్ కుమార్, మహ్మద్ అన్వర్లు అడ్డాల వద్ద నిరుపేద కూలీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలగిరి సీఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 23న తిరుమలగిరిలో అన్వర్‌ను పట్టుకున్నారు. అన్వర్‌ను విచారించగా పంకజ్ ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్లు తేలింది. ప్రస్తుతం పంకజ్ పరారీలో ఉండగా, గంజాయి క్రయవిక్రయాలు సాగిస్తున్న ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కిలోన్నర గంజాయి, 320 ప్యాకెట్ల పొగాకు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ నరేశ్, సీఐ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 24: ఘట్కేసర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం… పోచారం మున్సిపాలిటీ నారపల్లి గణేశ్‌నగర్‌లోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తనిఖీ చేశారు. ఇంట్లో 750 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ఇంట్లో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన సమర్జిత్ సింగ్(21), వెంకటాద్రి టౌన్‌షిప్‌కు చెందిన సాయిబాబా అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సమర్జిత్ సింగ్ మధ్యప్రదేశ్ నుంచి గంజాయి తీసుకువచ్చి సాయిబాబా ద్వారా విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఉప్పల్, ఫిబ్రవరి 24 : ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్ కథనం ప్రకారం… మల్లాపూర్ అశోక్‌నగర్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మరో బైక్‌పై వచ్చిన వ్యక్తి నుంచి బ్లాక్ ప్లాస్టిక్ కవర్లలో గంజాయి ప్యాకెట్లు మార్చుకుంటున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా గోవా నుంచి కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వారి నుంచి 45 ఎంఎల్ గంజా వీడ్ అయిల్, ఎల్ఎస్డీ బోల్ట్స్, 250 గ్రాముల లూజ్ గంజా, 3 మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నాగారం కీసర ప్రాంతానికి చెందిన సందీప్‌కుమార్(20), శంకర్(22), నితీశ్(25)గా గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వోలు మహేశ్వర్‌రెడ్డి, అబ్దుల్ జబ్బర్, సిబ్బంది పాల్గొన్నారు.