Manchu Lakshmi | నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న మంచు లక్ష్మి ఏ విషయాన్నైన నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. ఎప్పటికప్పుడు మనసులోని మాటలని స్ట్రాంగ్‌గా చెబుతూ హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన డ్రెస్సింగ్ స్టైల్‌ను ప్రశ్నించిన జర్నలిస్ట్‌కి ఆమె గట్టి సమాధానం ఇచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె నటించి, నిర్మించిన చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది మంచు లక్ష్మి. అయితే ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై తీవ్రంగా స్పందించారు.
50 ఏళ్లకు దగ్గరవుతున్న మీరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చింది. “ఇది ఒక మగాడిని అడిగేవారా?” “హౌ డేర్ యు ఆస్క్ మి దట్ క్వశన్? ఇదే ప్రశ్న మీరు ఒక మగనటుడిని అడుగుతారా? మహేష్‌బాబుని ఇలా అడగగలరా? షర్ట్ విప్పి తిరుగుతున్నావ్ అని? అదే ఆడపిల్లని ఇలా అడగడం ఏంటండి? ఇది జర్నలిజం పేరుతో చేసే నెగిటివ్ వైబ్స్” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక మగ నటుడు వయసు మీద పడినా షర్ట్ విప్పి డ్యాన్స్ చేస్తాడు. కానీ ఒక మహిళ వయసు పెరిగింది అని దుస్తుల మీద వ్యాఖ్యలు చెయ్యడం అన్యాయం. మహిళలకు సమాజంలో చాలా బాధ్యతలు ఉంటాయి. మా జీవితం పూర్తిగా ఇతరులపై ఆధారపడిపోయింది. ఫ్రీడమ్ మాకు ఎక్కడా ఉండదు, మేమే వెతుక్కోవాలి” అంటూ ఎమోషనల్‌గా చెప్పారు.
విడాకులు తీసుకున్న తర్వాత మాకు నువ్వు వద్దులేమ్మా అని పక్కన పెట్టేశారు. అదే ఒక మగాడు విడాకులు తీసుకుంటే నువ్వు మాకొద్దు అని చెప్పగలిగే ధైర్యం ఉందా ఈ ఇండస్ట్రీలో అంటూ ఘాటుగా స్పందించింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ వైరల్ కావడంతో, నెటిజన్లు మంచు లక్ష్మికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. “ఒక మహిళ ఏం వేసుకోవాలి అనే హక్కు ఆమెదే. ఇది యాంటీక్వేటెడ్ ప్రశ్న”, “ఎంత తెలివిగా సమాధానం ఇచ్చారు మంచు లక్ష్మి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ చిత్రం పోలీసు వ్యవస్థ, రాజకీయ కుట్రల నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనుండగా, వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు.
Manchu akka thatha ki gattiga ichindi 😉 thatha samantha anadu kani renu desai anukuntuna nenu 🤔 pic.twitter.com/bQyXP2EU2W
— ABD The Legend (@urstrulysai07) September 15, 2025