న్యూఢిల్లీ: ఉదయం తెల్లవారుజామున వీధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళను ఒక వ్యక్తి అనుసరించాడు. ఎవరూ లేని చోట వెనుక నుంచి ఆమె గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. (Man Tries To Strangle Woman On Street) కొంతసేపు పెనుగులాడిన ఆ మహిళ తర్వాత చనిపోయినట్లు నటించింది. దీంతో ఆ వ్యక్తి ఆమెను కింద పడేశాడు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్, బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 6.30 గంటలకు ఉత్తమ్ నగర్‌లోని సాయినాథ్ నగర్ ప్రాంతంలో ఇరుకైన వీధిలో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తున్నది. చలి కాలం వల్ల బాగా చీకటిగా ఉండటంతో శాలువ కప్పుకున్న ఆమెను ఒక వ్యక్తి అనుసరించాడు.
కాగా, ఆ వీధిలో ఎవరూ లేకపోవడంతో ఆమె వెనుక నుంచి చేతులతో గొంతు పట్టుకున్నాడు. ఆ మహిళ పెనుగులాడేందుకు ప్రయత్నించింది. దీంతో అతడు మరింత బలంగా ఆమె గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతరం ఆమె చలనం లేకుండా ఉండిపోయింది. చనిపోయిందని భావించిన అతడు మహిళను కింద పడేశాడు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్, బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు, కొన్ని నిమిషాల తర్వాత ఆ మహిళ పైకి లేచింది. చనిపోయినట్లు నటించి ఆ వ్యక్తి బారి నుంచి తప్పించుకున్న ఆమె వేగంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ మహిళ పర్సు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Delhi | Man Tries To Strangle Woman On Street; Steals Her Bag, Phonev
Read Here: https://t.co/qCPLn6FSeX pic.twitter.com/VTRJw2ILz4
— NDTV (@ndtv) January 8, 2024