Newark Airport | నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ఎమర్జెన్సీ స్లైడ్స్ నుంచి దిగిన ప్రయాణికులు
Newark Airport : తాజాగా అమెరికాలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో జెట్ బ్లూ విమానయాన సంస్తకు చెందిన ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది.
Newark Airport : విమానాల్లో చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా అది కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే ఏ సమస్య వచ్చినా పైలట్లు వెంటనే దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. తాజాగా అమెరికాలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.55 గంటలకు జెట్ బ్లూ విమానయాన సంస్తకు చెందిన ఎయిర్ బస్ 320 విమానం నెవార్క్ నుంచి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌కు బయల్దేరింది.
విమానం బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్ నుంచి పొగలు రావడాన్ని పైలట్లు గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించారు. విమానం బయల్దేరిన 17 నిమిషాల్లోనే తిరిగి నెవార్క్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారికి కీలక సూచన చేశారు. రెగ్యులర్ డోర్ నుంచి కాకుండా ఎమర్జెన్సీ స్లైడ్స్ నుంచి దిగాల్సిందిగా ప్రయాణికులకు సూచించారు. దీంతో వారంతా ఎమర్జెన్సీ డోర్స్ నుంచి త్వరగా దిగేశారు. ఈ సమయంలో విమానం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇతర విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎయిర్‌పోర్టును మూసివేశారు.
Video shared with Kol Haolam by a passenger on the JetBlue flight that made an emergency return to Newark Airport. Passengers amd crew evacuated via slides. pic.twitter.com/9gv3LgUd0B
— KolHaolam (@KolHaolam) February 18, 2026
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని విమానయాన సంస్థ జెట్ బ్లూ తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని సంస్థ ప్రకటించింది. కాగా.. విమానాలు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులకు సమాచారం అందించారు. కొందరు ప్యాసింజర్స్ తమ టిక్కెట్లు రద్దు చేసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

