హన్మకొండ : ఇచ్చిన అప్పు అడిగాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హన్మకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన గడ్డ నవీన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతడి దగ్గర కాజీపేటకు చెందిన ప్రవీణ్ కుమార్ రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాడు.
అయితే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ప్రవీణ్ కుమార్‌పై నవీన్ కుమార్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటకుమాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన ప్రవీణ్ కుమార్.. నవీన్ కుమార్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.