ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో (Viral Video) ఇల్లంటే ఎంతో ఖరీదైన విషయం. అద్దెకు ఓ చిన్న ఇంటిని ఎంచుకోవాలన్నా ఎంతో కష్టంతో కూడుకున్న పని. దేశంలోనే అత్యంత ఖరీదైన రెంట్లు పలికే నగరంగా ముంబై ముందువరుసలో నిలుస్తుంది. ఇండ్ల కిరాయిలు చుక్కలు తాకుతుంటాయి. సరైన వసతులున్న ఇంటికి వేలకు వేలు రెంట్ సమర్పించుకోవాలి.
అందుకే సగటు ముంబై వాసులు చిన్నా చితకా అపార్ట్మెంట్ల్లో తలదాచుకుంటారు. ఇరుకు గదుల్లో సంసారం గడిపేస్తుంటారు. ఇక ఇటీవల ఓ ఇన్స్టాగ్రాం యూజర్ ముంబైలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్ హోంటూర్ వీడియోను అప్లోడ్ చేశాడు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేసే హౌస్ టూర్ వీడియోలను తలపిస్తూ ఈ వీడియోను రికార్డు చేయడంపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. సుమీత్ పాల్వే అనే యూజర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేస్తూ రండి బాస్..మీకు నేను ఇల్లు చూపిస్తా..ఇక్కడి వసతులతో మీరు సర్ధుకుపోవాలి ఎందుకంటే ఇది దక్షిణ ముంబై అని రాసుకొచ్చాడు.
Read More :