ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి టైరు కింద నలిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
పాపన్నపేట, అక్టోబర్ 13: ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి టైరు కింద నలిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల సాయిలు (44) ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన సాయిలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ ఇస్మాయిల్‌తో కలిసి ఎంకెపల్లి గ్రామంలో నూతన ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటి మట్టిని తరలించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో మట్టి తరలింపు జరుగుతుండగా సాయిలు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడ్డాడు. అదే సమయంలో ట్రాక్టర్ టైరు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు సాయిలుకు భార్య పోచమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

