Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Farmers | చెరుకు రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాభావంతో దిగుబడి తగ్గిపోగా, మరోవైపు ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు పెరగడంతో పెట్టుబడి భారంగా మారింది.
Farmers | జహీరాబాద్, అక్టోబర్ 13 : చెరుకు రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాభావంతో దిగుబడి తగ్గిపోగా, మరోవైపు ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు పెరగడంతో పెట్టుబడి భారంగా మారింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని జహీరాబాద్ డివిజన్ చెరుకు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సగానికి పడిపోయిన దిగుబడి.. పెరిగిన ఖర్చులు
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరుకు పంట ఎదుగుదలపై ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరాకు 45 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 20 నుంచి 25 టన్నులకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. చెరుకు సాగులో ఎరువులు, దుక్కి దున్నడం, పంట కోత, రవాణా ఖర్చులు రైతులకు భారంగా మారాయి. కూలీలకు రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. చెరుకును ఫ్యాక్టరీకి తరలించే రవాణా ఖర్చులు కూడా తమపైనే పడుతున్నాయని పేర్కొంటున్నారు. దిగుబడి తగ్గిన సమయంలో ఖర్చులు పెరగడంతో నష్టాలు మరింత ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టన్నుకు రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్
చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి టన్నుకు రూ.5,500 ధర నిర్ణయించాలని, అదనంగా ప్రభుత్వం రూ.500 సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు పంట కోత, రవాణా ఖర్చులను ఫ్యాక్టరీ యాజమాన్యాలే భరించాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం టన్నుకు మొత్తం రూ.6 వేల ఆదాయం లభిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.
న్యాల్కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎరువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని, పంటకు సరైన ధర లభించకపోతే వాటిని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యాలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది చెరుకు సాగు చేయడం కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

