Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Jos Buttler: ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్‌కు సర్జరీ అయ్యింది. ఎడమకాలి తొడ కండరాలకు శస్త్రచికిత్స జరిగినట్లు ఆయన తన ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు.శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో అతను గాయపడ్డాడు. పాక్, ఆసీస్‌తో జరిగే సిరీస్‌లకు అతను దూరంకానున్నాడు.
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్, టాప్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ జోస్ బట్లర్(Jos Buttler)కు సర్జరీ అయ్యింది. ఎడమకాలి తొడ కండరాలకు శస్త్రచికిత్స జరిగినట్లు ఆయన తన ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు. గత నెలలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో అతను గాయపడ్డాడు. సెప్టెంబర్ 24వ తేదీన ఆ మ్యాచ్ ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేస్తూ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతన్ని సిరీస్ నుంచి తప్పించారు. ఇక త్వరలో పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌కు కూడా బట్లర్ దూరం కానున్నాడు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌కు కూడా బట్లర్ దూరంకానున్నట్లు తెలుస్తోంది. ఆ సిరీస్‌కు చెందిన బృందాన్ని మంగళవారమే ప్రకటించనున్నారు.
సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బట్లర్ సర్జరీ గురించి పోస్టు చేశారు. థమ్స్ అప్ సంకేతం ఇస్తూ బెడ్‌పై పడుకున్న ఓ ఫోటోను బట్లర్ పోస్టు చేశాడు. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని, వేగంగా కోలుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కన్నా ఎక్కువగా మోటివేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల బట్లర్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో విఫలమైన తర్వాత.. అతను 9 మ్యాచుల్లో 466 రన్స్ స్కోరు చేశాడు. గాయపడ్డ మ్యాచ్‌లో అతను 49 బంతుల్లో 69 రన్స్ స్కోర్ చేశాడు. కండరాలు పట్టేసిన ఆ ఇన్నింగ్స్‌లో అయిదు సిక్సర్లు కొట్టాడతను.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

