మెదక్ టౌన్ : మెదక్ పట్టణ పరిధిలోని సీడబ్ల్యూసీ గోదాం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మెదక్ పట్టణానికి చెందిన సద్దాం (40) అక్కడికక్కడే మృతి చెందాడు. సద్దాం కందుర్ కోసం నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న మెదక్ పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును మెదక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.