హైదరాబాద్ : ప్రమాదశాత్తు కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద అంబర్పేట వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకున్నది. కారు రన్నింగ్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి కారు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న వ్యక్తి మంటల్లోనే చిక్కుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్ధమైన కారు నంబరు హోండా అమేజ్ కారు (ఏపీ 27సీసీ0206)గా గుర్తించారు. అయితే, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.