విచారణకు పిలిచి హింసించారు
మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను సాక్షిగా విచారణకు పిలిచి అక్రమంగా నిర్బంధించారని, వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఏపీకి చెందిన మంగళంపల్లి నాగసాయి మణికంఠ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- ఈడీ అధికారులపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను సాక్షిగా విచారణకు పిలిచి అక్రమంగా నిర్బంధించారని, వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఏపీకి చెందిన మంగళంపల్లి నాగసాయి మణికంఠ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రిలో నాగసాయి మణికంఠకు చెందిన 27 ఎకరాల్లో 4 ఎకరాలను సందీప్ అనే వ్యక్తికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అనంతరం సందీప్ మొత్తం డబ్బు చెల్లించకపోవడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సందీప్ ప్రోద్బలంతో పిటిషనర్‌ను విచారణకు పిలిచి చిత్రహింసలు పెట్టడంతోపాటు బలవంతంగా స్టేట్మెంట్పై సంతకం చేయించుకున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని వివరించారు. పిటిషనర్ ఈ నెల 26న ఈడీ విచారణకు హాజరయ్యాడని పేర్కొంటూ.. ఆ రోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ కార్యాలయ సందర్శకుల జాబితా, ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లు, గేట్‌పాస్‌లు, సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు.
దీనిపై హైకోర్టు తీర్పు వెలువడే వరకు పిటిషనర్ వాంగ్మూలాన్ని ఎక్కడా వినియోగించరాదంటూ ఈడీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఈడీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో, సందీప్‌కు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

