విచారణకు పిలిచి హింసించారు
మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను సాక్షిగా విచారణకు పిలిచి అక్రమంగా నిర్బంధించారని, వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఏపీకి చెందిన మంగళంపల్లి నాగసాయి మణికంఠ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- ఈడీ అధికారులపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను సాక్షిగా విచారణకు పిలిచి అక్రమంగా నిర్బంధించారని, వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఏపీకి చెందిన మంగళంపల్లి నాగసాయి మణికంఠ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రిలో నాగసాయి మణికంఠకు చెందిన 27 ఎకరాల్లో 4 ఎకరాలను సందీప్ అనే వ్యక్తికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అనంతరం సందీప్ మొత్తం డబ్బు చెల్లించకపోవడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సందీప్ ప్రోద్బలంతో పిటిషనర్‌ను విచారణకు పిలిచి చిత్రహింసలు పెట్టడంతోపాటు బలవంతంగా స్టేట్మెంట్పై సంతకం చేయించుకున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని వివరించారు. పిటిషనర్ ఈ నెల 26న ఈడీ విచారణకు హాజరయ్యాడని పేర్కొంటూ.. ఆ రోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ కార్యాలయ సందర్శకుల జాబితా, ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లు, గేట్‌పాస్‌లు, సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు.
దీనిపై హైకోర్టు తీర్పు వెలువడే వరకు పిటిషనర్ వాంగ్మూలాన్ని ఎక్కడా వినియోగించరాదంటూ ఈడీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఈడీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో, సందీప్‌కు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. దంపతులకు తప్పిన పెను ముప్పు!
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
Bigg Boss 10 | మాజీ కంటెస్టెంట్లతో హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు.. ముకేష్‌పై త్రిగుణ్ ఫైర్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
Satvika Veeravalli | చూపు తిప్పుకోనివ్వని అందం.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి ఫొటోలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

