మియాపూర్ భూములు పేదలకు పంచాలి
మియాపూర్ భూములను పేదల కోసం వినియోగించాలని, ఆ భూములమ్మి దందాలు చేస్తామంటే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- ఆ భూములపై రేవంత్‌వి పచ్చి అబద్ధాలు
- 1995 నుంచి నలుగుతున్న వివాదం
- కలెక్టర్ వద్దకెళ్లి తెలుసుకో రేవంతూ..
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మియాపూర్ భూములను పేదల కోసం వినియోగించాలని, ఆ భూములమ్మి దందాలు చేస్తామంటే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మియాపూర్ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఆ భూముల వివాదం 1995 నుంచి నలుగుతున్నదని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఆ కలెక్టర్ వద్దకెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో కలిసి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కియోస్క్ నమూనాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని చురకలు అంటించారు. కోర్టు తీర్పులను చూపుతూ ఒకరిపై బట్టకాల్చి మీద పడేస్తామంటే సహించబోమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద భూస్వామి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. క్యూర్ పరిధిలోని 7 లక్షల ఎకరాలకు సీఎం గుత్తేదారుగా ఉన్నారని, ఎక్కడపడితే అక్కడ అప్పనంగా భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. విద్య, వైద్యరంగాలతోపాటు రైతన్నల సమస్యలను రేవంత్ సర్కార్ పరిష్కరించడమే లేదని మండిపడ్డారు.
సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కర్ణాటక, యూపీల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీలకు షాక్ తగిలిందని, తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీకి యువత కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. విద్యావంతులు సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా.. ప్రజాక్షేత్రంలోకి వచ్చి గొంతెత్తాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, విప్లవ్‌కుమార్, మహేశ్‌యాదవ్, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

