గురుకుల విద్యార్థి మృతి ఘటనలో ఇద్దరి సస్పెన్షన్
విద్యార్థి మృతిచెందిన ఘటన నేపథ్యంలో బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రవి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): విద్యార్థి మృతిచెందిన ఘటన నేపథ్యంలో బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పరకాల-ఓగ్లాపూర్‌లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్/జూనియర్ కళాశాల (బాలుర)లో ఇంటర్ బీపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పీ కార్తీక్ 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జోనల్ ఆఫీసర్ నివేదికను సమర్పించారు.
కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆనందరావు, పీజీటీ (తెలుగు), హౌస్‌మాస్టర్ ఆర్వీ శంకర్, జూనియర్ లెక్చరర్ (బోటనీ)విద్యార్థులకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలను సకాలంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా అలక్ష్యం చేయడం, సమర్థవంతంగా విధులను నిర్వర్తించకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవడమే ఘటనకు కారణమని తేల్చారు. ఆ నివేదిక ఆధారంగా సొసైటీ సెక్రటరీ రవి ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

