Mamata Banerjee : అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Leonal Messi) పర్యటన సందర్భంగా గత ఆదివారం పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లోని సాల్ట్ లేక్ స్టేడియం (Salt lake stadium) లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్రిక్తతలకు బాధ్యత వహిస్తూ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ (Sports minister) అరూప్ బిశ్వాస్ (Aroop Biswas) తన పదవికి రాజానామా చేయగా.. ఆ రాజీనామాకు సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) ఆమోదముద్ర వేశారు.
సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వారిని లోపలికి పంపడంలో ఆలస్యం జరిగింది. మెస్సీ కార్యక్రమం ముగించుకుని వెళ్లేసరికి ఇంకా సగం మంది స్టేడియం బయటే ఉన్నారు. దాంతో తమ దగ్గర డబ్బులు వసూలు చేసి స్టేడియంలోపలికి ఎందుకు అనుమతించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవెంట్ నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. స్టేడియంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
ఈ ఘటన రాజీకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. మెస్సీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆ రాజీనామాకు సీఎం మమతా బెనర్జి ఆమోదముద్ర వేశారు.